23-11-2025 08:37:38 PM
చేగుంట: చేగుంట మండలంలోని మక్కారాజుపేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ విశ్వేశ్వర్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, రాజగోపాల్, రాములు గౌడ్ సతిరెడ్డి, జూనెద్, మోహన్ రెడ్డి, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.