23-11-2025 08:33:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ జిల్లాలో వ్యాపార రంగంలో ఆర్యవైశ్యులు ముందున్నారని సామాజిక సేవ ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సంఘ సభ్యులకు సూచించారు. సంఘం భవన నిర్మాణానికి 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆ మెడ శ్రీధర్ నాయకులు లక్ష్మీనారాయణ సభ్యులు పాల్గొన్నారు