calender_icon.png 23 November, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి అభ్యర్థులకు ఘన సన్మానం

23-11-2025 09:01:11 PM

కోదాడ: బిజెపి పార్టీ జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన అభ్యర్థుల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం కోదాడ పట్టణంలోని బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ నివాసంలో నిర్వహించారు. నూతన కమిటీ ఎన్నికలలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగవీటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు, కార్యదర్శి ఎరగాని కళావతి రాధాకృష్ణ కార్యదర్శి శ్రీను నాయక్ లను  శాలవాకప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ఓరుగంటి పురుషోత్తం, సుంకర లింగారెడ్డి, రవి నాయక్, రాధాకృష్ణ, దేవునూరీ లక్ష్మి, నాగేంద్ర చారి, గాదరి పుల్లారావు, వంగాల పిచ్చయ్య, అంబటి సుధాకర్ రెడ్డి, కనుమర్లపూడి శ్రీహరి, మీసాల మార్కండేయ, బొమ్మ శ్రీను, సంపేట భాగ్యరాజు, మారుతి కొండయ్య మరియు తదితరులు నాయకులు పెద్దలు పాల్గొన్నారు.