23-11-2025 08:35:23 PM
బెజ్జంకి: ప్రతి మహిళకు మన్నికైన చీర అందించే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల మహిళా సంఘంల ఆధ్వర్యం పంపిణీ చేశారు. ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులతో కాంగ్రెస్ నాయకులు కలిసి చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మహిళల సంక్షేమం కోసం పంపిణీ చేస్తున్నట్లు గ్రామ అధ్యక్షులు ఐలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘం సభ్యులు, సీసీ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.