23-11-2025 09:03:59 PM
గుండాల (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని స్థానిక రైతు వేదికలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగుతుంది అన్నారు. మహిళా సంఘాల మహిళలందరికీ ఒకే రకమైన చీరలను అందిస్తున్నామన్నారు.
రాబోయే స్థానిక సర్పంచ్, ఎంపి టిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ నాగిరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, మహిళా సహకార అభివృద్ది సంస్థ ఛైర్మెన్ బండ్రు శోభా రాణి, మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విమల, పిఎసిఎస్ ఛైర్మెన్ లింగాల భిక్షం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షరాలు కందుకూరి రేణుక, పొడిశెట్టి వెంకన్న, కోర్న నరేష్, పొన్నగాని నారాయణ, మహిళలు పాల్గొన్నారు.