calender_icon.png 23 November, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

23-11-2025 08:56:59 PM

మఠంపల్లి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ జన్మదినం పురస్కరించుకుని మఠంపల్లి మండల ప్రధాన రహదారిపై అంబేద్కర్ కూడలి వద్ద ఆదివారం మఠంపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజన సమాజానికి రాజ్యాధికారం సాధించేందుకు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేశారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మఠంపల్లి మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస రెడ్డి,పెదవీడు మాజీ ఎంపీటీసీ కుందూరు వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు,పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు పిండిప్రోలు రామచంద్రయ్య, హరిచంద్,మండల నాయకులు వస్కుల జయరాజు,చిన్నపంగు రాజీవ్,బేత శివారెడ్డి,బత్తుల నాగరాజు,ఆరాల నాగరాజు, నాగబాబు,సురేష్ పలువురు మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.