calender_icon.png 23 January, 2026 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర కుట్రలపై కాంగ్రెస్ నిరసన

23-01-2026 08:43:52 PM

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర కుట్రలపై కాంగ్రెస్ నిరసన

 తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో విధానాలు అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలు, వీబీజీ రామ్ జీ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రజలు సాధించుకున్న చట్టబద్ధమైన పని హక్కును కేంద్రం కాలరాస్తోందని తెలిపారు. కార్పొరేట్ లాభాల కోసమే పేదల జీవనాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.