23-01-2026 08:45:49 PM
వేములవాడ,(విజయక్రాంతి): భారతదేశ స్వాతంత్రం కోసం ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి కీలక పాత్ర పోషించిన మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. శుక్రవారం వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన శాత్రాజు పల్లిలో బోస్ 129వ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుడిసె సదానందం మాట్లాడుతూ, విదేశాల్లోని భారతీయులతో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను పునఃసంఘటితం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్య సాధనలో బోస్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్ యూత్ అధ్యక్షులు వికుర్తి సాయి, మాజీ పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, నల్లా సతీష్ రెడ్డి, గుడిసె అనిల్, అయుత వెంకటేష్, కిషన్ రెడ్డి, మధు, బండ మహేందర్, వీరేందర్, భూపేందర్ రెడ్డి, దాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.