calender_icon.png 11 December, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలాల్లో అత్యధికంగా గెలిచిన కాంగ్రెస్ సర్పంచులు

11-12-2025 10:22:12 PM

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభివృద్ధితోనే ఈ గెలుపు..

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్..

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం..

మంథని (విజయక్రాంతి): మంథని, ముత్తారం, రామగిరి మండలాలలో గురువారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో దూసుకుపోయింది. మంథని మండలంలో 35 గ్రామ పంచాయతీలకు గాను 29 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా, బీఆర్ఎస్ పార్టీ చెందిన ఆరుగురు అభ్యర్థులు గెలుపొందారు. ముత్తారం మండలంలో 15 గ్రామ పంచాయతీలలో 11 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలవగా, 4 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.   

రామగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 10 పదిమంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలవగా, బీఆర్ఎస్ పార్టీ నాలుగురు, ఇండిపెండెంట్ ఒకరు, పెండింగ్ లో పెద్దంపేట గ్రామ పంచాయతీ ఉంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కృషితో మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో అత్యధిక స్థానాలలో గెలుపొందారని మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మంథని, ముత్తారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, దొడ్డ బాలాజీ లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.