calender_icon.png 11 December, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో తొలి విడత పోలింగ్ శాతం 84.58

11-12-2025 10:10:45 PM

మొత్తం ఓట్లు 66,689.పోలైన ఓట్లు  56,403

నారాయణపేట (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్ 84.58 శాతం నమోదు అయింది. గుండుమల్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 66,689 ఓట్లు ఉండగా, 56,403 ఓట్లు పోల్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 84.58 శాతం పోలింగ్ నమోదు అయింది.

అయితే నాలుగు మండలాల్లో మొత్తం 34,146 మంది మహిళా ఓటర్లకు గాను 27,837 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తం 32,540 మంది పురుష ఓటర్లకు గాను 28,566 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నాలుగు మండలాలలో అత్యధికంగా కోస్గి మండలంలో 86.7 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా గుండుమల్ మండలంలో 83.06 పోలింగ్ నమోదు అయింది. 

మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం

గుండుమల్ మండలంలో మొత్తం ఓటర్లు 15,534 మంది ఓటర్లు ఉండగా, 12,903 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో మొత్తం 83.06 శాతం పోలింగ్ నమోదు అయింది. కోస్గి మండలంలో మొత్తం ఓటర్లు 16,805 మంది ఉండగా, 14,570 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో 86.7 శాతం పోలింగ్ నమోదు అయింది. కొత్తపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 12,753 మంది ఉండగా, 10,466 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో 83.17 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక మద్దూరు మండలంలో మొత్తం ఓటర్లు 21,597 మంది ఉండగా, 16,552 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం నాలుగు మండలాలు కలిపి 84.58 శాతం పోలింగ్ నమోదు అయింది.