11-12-2025 10:13:16 PM
74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
నారాయణపేట (విజయక్రాంతి): ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 74 మంది ఎన్నికల సిబ్బంది గైర్హాజరయ్యారని, వారికి షోకాస్ నోటీసులు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.