calender_icon.png 12 December, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాప‌న్న‌పేట మండలంలో 88.9 శాతం నమోదు

11-12-2025 10:35:52 PM

* 26 మంది కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారుల గెలుపు

పాప‌న్న‌పేట‌: తొలి విడ‌త గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పాప‌న్న‌పేట మండ‌లంలో మొత్తం 40 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 6 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమ‌య్యారు. 34 సర్పంచుల స్థానాలకు 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 250 వార్డు స్థానాలకు 545 మంది బరిలో నిలిచారు. మండలంలో 88.9 శాతం పోలింగ్ నమోదయింది. మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో అత్యధికంగా 96 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 296 పోలింగ్ బూత్ లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో గెలుపొందిన సర్పంచులు...

పాపన్నపేట గ్రామ సర్పంచ్ గా లింగంపేట పావని నరేందర్ గౌడ్(642) మెజారిటీతో గెలుపొందారు. దౌలాపూర్ రేష బోయిన అంజయ్య(9), ముద్దపూర్ పిట్ల నాగరాజు(15), ఆరెపల్లి రజిత రాజశేఖర్(45), ఎనికెపల్లి యాదగిరి(13), సీతానగరం గొల్ల రమేష్, చికోడ్ బెస్త బాలయ్య(126), కొత్త లింగాయిపల్లి బంజ శ్రీశైలం(232), అర్కెల్ బేగారి శ్రీను(117), కుర్తివాడ శ్రీధర్, డాక్యా తండా స్వప్న హీరాలాల్, అబ్లాపూర్ నిరూడి వెంకటేశం(348), ఎల్లాపూర్ శేఖర్, గాంధారిపల్లి సిద్ధిరామ్ రెడ్డి(86) మెజారిటీతో గెలుపొందారు.

బీఆర్ఎస్ మ‌ద్ద‌తుతో గెలుపొందిన వారు..

శానాయిపల్లి పంచాయ‌తీకి సాయన్నోళ్ల మంగమ్మ(26), తమ్మాయిపల్లి ధరావత్ సక్రు, కొంపల్లి జూకంటి పాపయ్య(171), రామతీర్థం కయ్యం సాయి రెడ్డి గెలుపొందారు.