calender_icon.png 12 December, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు

11-12-2025 10:38:21 PM

హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మండలంలో 12 జీపీలకు 39 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీపడ్డారు. మండలంలో 16,954(పురుషులు 8,361, మహిళలు 8,593) మంది ఓటర్లుండగా ఉదయం తొమ్మిది గంటల వరకు 3,176 (19%), 11 గంటల వరకు 9,167 (54%), ఒంటి గంట వరకు 14,371 (84.76%), ఒంటి గంట అనంతరం క్యూలో నిలబడిన వారు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ 14,420 (85.05%)కి చేరుకుంది. మండల వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 7,057 (84.40%) పురుషులుండగా, 7363 (85.69%) మహిళలు ఉన్నారు. 

విజయం సాధించిన సర్పంచులు వీరే...

హాజీపూర్ మండలంలో 12 గ్రామ పంచాయతీలకు 39 మంది అభ్యర్థులు సర్పంచు పదవి కోసం పోటీ పడ్డారు. ఇందులో గడ్ పూర్ గ్రామ సర్పంచిగా గునిగంటి స్వప్న (కాంగ్రెస్) గెలుపొందగా ర్యాలీ జీపీలో జుగునాక అరుణ (కాంగ్రెస్), చిన్నగొల్లాపూర్ లో జుగునాక రాజేష్ (కాంగ్రెస్), నాగారంలో పెండ్రం మహేశ్వరి (కాంగ్రెస్), రాపల్లిలో మిట్టపల్లి రాంరెడ్డి ( కాంగ్రెస్ ), కర్ణమామిడిలో బొడ్డు భూమయ్య (కాంగ్రెస్), బుద్దిపల్లిలో దుర్గం సంధ్య (కాంగ్రెస్), హాజీపూర్ లో మాధవరపు శ్రీలత (బీ ఆర్ ఎస్), దొనబండలో బేతు రమాదేవి (బీజేపీ), టీకానపల్లిలో బూర్ల తిరుపతమ్మ (కాంగ్రెస్ రెబల్), 

పెద్దంపేటలో జాడి వెంకటేష్ (బీఆర్ఎస్), పడ్తనపల్లి గ్రామ సర్పంచిగా దొండ యేసయ్య (కాంగ్రెస్) విజయం సాధించారు. హాజీపూర్ మండలంలో 106 వార్డులుండగా 22 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 84 వార్డులకు ఎన్నికలు జరుగగా 219 మంది అభ్యర్థులు వార్డులకు పోటీ పడ్డారు.