calender_icon.png 12 December, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ఫలితాల వెల్లడిపై తీవ్ర జాప్యం

11-12-2025 10:27:26 PM

ఆందోళన చెందుతున్న అభ్యర్థులు రాజకీయ పార్టీలు..

అధికార పార్టీ పొత్తిడికి లొంగి కావాలనే అధికారులు జాప్యం చేస్తున్నారని రాజకీయ పార్టీల ఆరోపణ..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలతో సమానంగా ప్రారంభమైన ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరగటం పట్ల రాజకీయ పార్టీ నాయకులు పోటీ చేసిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు కౌంటింగ్ పూర్తి అయిన రాత్రి 10 గంటలైనా సర్పంచ్ వార్డు మెంబర్ల ఫలితాలు విడుదల చేయకపోవడం పట్ల జరిగిన జాతీయాన్ని ప్రశ్నిస్తున్నారు.

అధికారులు కావాలనే అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాల అభ్యర్థులపై కుట్ల చేస్తున్నట్లుగా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ భద్రాచలం డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు. భద్రాచలం కౌంటింగ్ కేంద్రం వద్ద కావాలని ఆలస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని వార్డులు ఫలితాలు వచ్చినప్పటికీ ఎందుకు ప్రకటన చేయట్లేదని అయిన ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు వివక్ష వీడి ఫలితాలు ఎప్పటికప్పుడే విడుదల చేయాలని రాంప్రసాద్ కోరారు.