ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి
11-05-2024 01:01 AM
బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల
మేడ్చల్, మే 10 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్‌ను ఓడిద్దామని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జగద్గిరిగుట్టలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షో, పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిన అవసరముందని తెలిపారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






