‘విజన్ డాక్యుమెంట్’ను అమలు చేసి తీరుతా
రవాణా సౌకర్యాలను మెరుగు పరుసా..్త
వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పిస్తా..
బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, మే 10 (విజయక్రాంతి): అభివృద్ధి పనులపై తాను ‘విజన్ డాక్యుమెంట్’ రూపొందించానని, తాను ఎన్నికల్లో గెలిస్తే వందకు వందశాతం ఆ ప్రణాళికను అమలు చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో శుక్రవారం ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షు డు దినేష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాకు పసుపు, వరి, మక్క, చెరుకు, మామి డి ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తానన్నా రు. రవాణా సౌకర్యాలు మెరుగు పరిచేందు కు జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు, ఆర్మూర్ బోధన్ రైల్వేలైన్లు, ముధ్ ఖేడ్ వయా నిజామాబాద్ డబ్లింగ్ పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. లాజిస్టిక్స్ సపోర్ట్‌కు ఇన్‌లాండ్ కంటైనర్ డిపో, సీఎస్‌ఆర్ నిధులతో స్కిల్ డెవెలప్‌మెంట్ సెంటర్ నిర్మిస్తానన్నారు. నిరుద్యోగు లకు పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయిస్తానన్నారు. గల్ఫ్‌కు వలసలను తగ్గిస్తానన్నారు.






