2 May, 2026 | 5:24 AM

నామా ప్రచారానికి వనమా దూరం

11-05-2024 01:00 AM

రాఘవేంద్రరావును నమ్మని నామా వర్గం

బీఆర్‌ఎస్‌లో రాఘవేంద్రరావుకు నిరాదరణ?

భద్రాద్రి కొత్తగూడెం, మే 10 (వియజక్రాంతి): ఖమ్మం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరుఫున ప్రచారం చేయడంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కన్పించట్లేదు. ఆయన తనయుడు ప్రచారంలో ఉన్నా బీఆర్‌ఎస్ వర్గాల నుంచి నిరాదరణ కనిపిస్తున్నదని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. కేసీఆర్ రోడ్ షోలో తప్పా ఇప్పటివరకు ఎక్కడ నామా ప్రచారంలో ఆయన కన్పించలేదు.

ఇటీవల బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ వనమా, ఆయన వర్గం కన్పించపోవడం చర్చనీయాంశమైంది. దీంతో వనమా వెంకటేశ్వరరావు నామాకు మద్దతు ఇవ్వడంలేదని, వనమా రాఘవేంద్రరావును నామా వర్గీలు నమ్మడంలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  వర్గపోరు పార్టీకి  తీరని నష్టం చేకూర్చుతుందనే ప్రచారం జరుగుతోంది.