26 April, 2026 | 6:54 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

28-04-2024 01:36 AM

l బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు

l బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

మంచిర్యాల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తిగా నెరవేర్చని కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శని వారం క్యాథనపల్లి మున్సిపాలిటీలో బాల్క సుమన్ నివాసంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అన్నదమ్ములు వివేక్, వినోద్  ఎమ్మెల్యేలుగా ఉన్నారని, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వివేక్ కొడుకుకు టికెట్ ఇవ్వడం కుటుంబపాలన కాదా అని ప్రశ్నించారు.