మోదీ వెన్నంటే యువత
l చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
రాజేంద్రనగర్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ప్రధాని మోదీ వెంటే యువత ఉందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం శంషాబాద్‌లో జరిగిన బీజే ఏపీ యువమోర్చా యువ సమ్మేళనంలో కొండా పాల్గొన్నారు. ఈ సందర్భం గా కొం డా మాట్లాడుతూ.. గత పదేండ్లుగా ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛంద ంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమైనా బీజేపీ గెలుపును ఆపలేవని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ప్రధాని మోదీ మరోమారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి గణేష్, కార్యవర్గ సభ్యులు ప్రేమ్‌రాజ్, జంగయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నర్సింహ్మరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, చేవెళ్ల అధ్యక్షులు తరుణ్‌రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ పాల్గొన్నారు.






