02-02-2026 12:39:28 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకోవాలని ఏఐసీసీ ఇంచార్జి సెక్రటరీ విశ్వనాథన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నాయకులంతా ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతూ చైర్మన్ పీఠం కచ్చితంగా చేజిక్కించుకోవాలన్నారు.
నాయకుల ఐక్యతను చూస్తే తప్పకుండా మున్సిపాలిటీ గెలుస్తామనే పూర్తి నమ్మకం కలుగుతోందన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, అనుములపురి రవిబాబు, ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.