02-02-2026 12:41:11 AM
గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం
మిర్యాలగూడ, ఫిబ్రవరి 1: పట్టణంలోని ఎఫ్సీఐ గోదాంలోకి ఆదివారం ఉదయం గూడ్స్ రైలు వచ్చింది. ఈ క్రమంలో జడ్చర్ల-కోదాడ రహదారి మీదుగా గోదాములోకి వెళ్తున్న క్రమంలో గూడ్స్ ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడి రైలు రోడ్డు మధ్యలో ఉన్న రైలు పట్టాలపై నిలిచి పోయింది. దీంతో సుమారు గంటకి పైగా ట్రాఫిక్ కి అంతరాయము ఏర్పడింది. రైల్వే ఇంజినేర్లు వచ్చి సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసి గోదాములోకి తరలించారు. మిర్యాలగూడ గ్రామీణ ఎస్త్స్ర లక్ష్మయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ని మల్లించి క్రమబద్దిక రించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.