02-02-2026 12:38:29 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ లో డాక్టర్ సి. మల్లేష్ జనవరి 19 నుంచి 24 వరకు నిర్వహించిన ఉన్నత్ భారత్ అభియాన్ కింద కమ్యూనిటీబేస్డ్ పార్టిసిపేటరీ రీసెర్చ్ అంశంపై జరిగిన ఆరు రోజుల జాతీ య స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఎఫ్ డి పి ను యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్, ఉన్నత్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా అధ్యాప కులకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, గ్రామీణ భాగస్వామ్య పరిశోధన, సామాజిక బాధ్యత వంటి అంశాల్లో మాస్టర్ ట్రైనర్లుగా సామర్థ్యాభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది.
కార్య క్రమం చివర్లో నిర్వహించిన వాలెడిక్టరీ స మావేశంలో డాక్టర్ సి. మల్లేష్కు విజయవంతమైన పూర్తి ధృవీకరణ పత్రాన్ని ప్రధాన అతిథిగా హాజరైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ జనరల్ జి. నరేంద్ర కుమార్ అందజేశారు. ఎఫ్‌డిపిను పూర్తి చేయడం ద్వారా మల్లేష్ అకాడమిక్ సేవలు, సామాజిక బాధ్యతతో కూడిన పరిశోధన, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై నిబద్ధత బలపడిందని పేర్కొనవచ్చు.