ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా కాంగ్రెస్
డీసీసీ అధ్యక్షురాలు ఉమ
కేసముద్రం, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ అన్నారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో పలుస మౌనిక భర్త రాజు ఇటీవల కూలి పనికి వెళ్లి గుండెపోటుతో మరణించగా, మండల అధ్యక్షులు చిలివేరు సమ్మిగౌడ్, డీసీసీ అధ్యక్షులు ఉమతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు.
డీసీసీ అధ్యక్షురాలు ఉమ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 4 వేల రూపాయలు, ఒక క్వింటా బియ్యo అందించారు. భవిష్యత్ లో మౌనిక పిల్లలకు ఎలాంటి కష్టం వచ్చినా,చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఆకుల వెంకటయ్య గుoడెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి క్వింటా బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, ఆయూబ్ ఖాన్, తరాల వీరేష్ యాదవ్, బధ్యనాయక్, బాలునాయక్, సామల నర్సయ్య, ప్రభాకర్, ప్రభావతి, చారి, నాగన్న, కళాధర్,కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ బండారు గోపమ్మ, నూకల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.






