13-01-2026 12:00:00 AM
పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రామారావు
కోదాడ, జనవరి 12: గ్రీన్ ట్రిబ్యునల్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి నిరంతరం బాధితులకు అండగా ఉంటున్నారని అటువంటి వారిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి బాధితుల దగ్గరికి వెళ్లి వారికి భరోసా కల్పించారాని అన్నారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 375 మంది బాధితుల పక్షాన కోర్టులో పోరాటం చేస్తామని తెలిపారు. మల్లయ్య ను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన పాలనలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుసు అన్నారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి చొరవతో కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 100 పడకల ఆసుపత్రి, విశ్వవిద్యాలయాలు, రైతులకు లిఫ్టులు వంటి అభివృద్ధి పనులతో రాష్ట్రంలోనే కోదాడ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, యడవల్లి బాల్ రెడ్డి, చింతలపాటి శ్రీనివాసరావు, ఈదుల కృష్ణయ్య, కాంపాటి శ్రీను, పాలూరి సత్యనారాయణ, అంబడికర్ర శ్రీను పాల్గొన్నారు.