calender_icon.png 13 January, 2026 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం

13-01-2026 12:00:00 AM

వ్యవసాయ పనిముట్ల పంపిణీలో ఎంపీ, ఎమ్మెల్యేలు

ఆలేరు, జనవరి12 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ,అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకెళ్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యలు అన్నారు. సోమవారం ఆలేరు మార్కెట్ యార్డులో రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రీయ కృషి వికాస్ యువజనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు అండగా ఉంటుందని అన్నారు.

రైతన్నలకు తాజాగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులోకి తెచ్చేందుకు అడుగులు వేస్తుందని చెప్పారు. ఇట్టి విషయంలో ఆలేరు నియోజకవర్గానికి బడ్జెట్లో రూ.58 లక్షలను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్యమహేందర్ రెడ్డి, డీఏఓ వెంకటరమణారెడ్డి, ఏడీఏలు శ్రీనివాస్ గౌడ్, శాంతినిర్మల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, నీలం పద్మవెంకటస్వామి, సాగర్ రెడ్డి, శ్రీశైలం, మురళి, యాదగిరి, కుమారస్వామి, చిరుమర్తి రేణుకనరసింహ, సంతోష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.