calender_icon.png 16 December, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన మెచ్చి కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం

13-12-2025 01:07:16 AM

  1. కవిత ఆరోపణలపై విచారణ కోరుతాం
  2. ఈనెల 14న రామ్‌లీలా మైదానంలో మహాధర్నాకు సీఎం, మంత్రులు
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ప్రజాపాలన మెచ్చి మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు ప్రజలు పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 4,230 పంచాయతీలకు గానూ కాంగ్రెస్ మద్దతుదారులు 2 వేల 600 పైచిలుకు స్థానాల్లో గెలి చారని, వెయ్యికి దగ్గరగా బీఆర్‌ఎస్, 200 లోపు బీజేపీ, 40 స్థానాలు సీపీఎం, 30 స్థా నాల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచారన్నారు.

సర్పంచులుగా గెలిచిన కాంగ్రెస్ మద్దతు దా రులకు ఆయన అభినందనలు తెలిపారు. ఏకగ్రీవమైన చోట్ల 90 శాతం కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. సర్పంచ్ ఫలితాలపై సీఎం సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.  ఈ నెల 14న రామ్ లీలా మైదాన్‌లో జరిగే మహాధర్నాలో సీఎం రేవంత్, కేబినెట్ మొత్తం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఏసీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. 14 లక్షల వరకు ఓట్ చోరీ సంతకాల సేకరణ జరిగిందన్నారు.

రెండో విడత , మూడో విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ మద్దతు దారులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమే ఈ పంచాయతీ ఫలితాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌తో ఊహించని విధంగా 5 లక్షల 75 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణ వికాసం వైపు పయనిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం పట్ల పెట్టుబడిదారులకు నమ్మకం, విశ్వాసం పెరిగిందన్నారు.

ఈ నెల 14వ తేదీన రామ్ లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో నేతలందరూ పాల్గొంటారని చెప్పారు. ఓట్ చోరీ తోనే తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిచారని విమర్శించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలున్న బీజేపీ పంచాయతీల్లో ఎన్నిగెలిచింది? అని ప్రశ్నించారు. కవితకి సీఎం కావాలనే ఆశ ఉంటే తప్పు లేదని, కానీ మనిషికి అత్యాశ ఉండకూడదన్నారు. కవిత కొన్ని వాస్తవాలను బయటపెడుతోందని, కవిత ఆరోపణలపై విచారణ చేయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.