16-12-2025 01:54:03 PM
సన్మానించిన కాంగ్రెస్ నేత వహీద్ ఖాన్
సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట ఆటో ఎలక్ట్రిషియన్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన మొహమ్మద్ కలీం కు రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ నాయకులు వహీద్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సిద్దిపేటలో కలీమ్ ను పూలమాల, షాలువాతో ఘనంగా సన్మానించారు. వహీద్ ఖాన్ మాట్లాడుతూ, యూనియన్‌కు ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్‌చార్జి హరికృష్ణ సహకారం, టౌన్ అధ్యక్షులు అత్తు ఇమామ్ సహాయంతో యూనియన్‌కు ప్రభుత్వం ద్వారా అందే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాల్, షాబాజ్, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.