16-12-2025 03:29:06 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల పరిధిలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోతు లచ్చిరాంనాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సామా అభిషేక్ రెడ్డి లచ్చిరాంనాయక్ పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబీకులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నర్సిరెడ్డి, చెంచల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గుయ్యని బాబు, నిద్ర సంపత్ నాయుడు, రామునాయక్, రెడ్యానాయక్, వెంకన్న, శేఖర్, కృష్ణబాబు, లింగరాజు, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.