13-12-2025 01:06:16 AM
రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలం గాణ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ నెల 28న ఎల్బీనగర్ అనన్య రిసార్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పదివేల మందికి పైగా జరిగే బీసీ జన భోజనాల పోస్టర్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించారు.
ఈ బీసీ జన భోజన కార్యక్రమానికి తెలంగాణలో ఉన్న బీసీ లాయర్స్‌ను ఆహ్వానించడం కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి చామకూర రాజు బృందం రంగారెడ్డి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ ఆవిష్కరణలో పొన్నం దేవరాజ్ గౌడ్ బీసీ లాయర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ, రాజు యాదవ్, దూడల నరసింహ, దూకుంట్ల శ్రీధర్, చాలామంది న్యాయవాదులు పాల్గొన్నారు.