13-12-2025 01:07:40 AM
ఎంఆర్‌ఎన్‌హెచ్‌లో విజయవంతంగా చికిత్స
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మల్లారెడ్డి నారాయణ మల్టీస్పె షాలిటీ హాస్పిటల్ (ఎంఆర్‌ఎన్‌హెచ్)లో 54 ఏళ్ల పురుషుడికి అత్యంత అరుదైన పిత్తాశయ క్యాన్సర్‌ను విజయవంతంగా శస్త్రచికి త్స చేసి నయం చేశారు. ఈ కేసులో క్యాన్సర్‌కు సంబంధించిన కణితి ఎంబోలీ పిత్తాశ య మార్గంలో ఉన్నప్పటికీ సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల లక్షణాలు లేవు. వైద్య చరిత్రలో చాలా అరుదుగా కనిపించే పరిస్థితి ఇది.
మినిమల్ యాక్సెస్, హెచ్‌పీడీ, జీఐ ఆంకో సర్జరీల డైరెక్టర్ డా. ఎం. మనిసేగరన్ ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. మధుమేహం, హైపోథైరాయిడ్ సమస్యలున్న రోగి, కేవలం తేలికపాటి కడుపు నొప్పి తో ఎంఆర్‌ఎహ్‌ను సంప్రదించారు. పరీక్షలలో ఈ అరుదైన కాన్సర్ గుర్తించారు. క్యా న్సర్, పిత్తాశయ మార్గంలో అసాధారణత, కాలేయ సిర్రోసిస్ వంటి సమస్యలు కలిసి ఉండటం వలన, శస్త్రచికిత్సకు అత్యంత ఖచ్చితత్వం, సమన్వయం అవసరమైంది.
నిపుణు ల బృందంచే అధునాతన శస్త్రచికిత్స చేశా రు. రోగి శస్త్రచికిత్సకు బాగా స్పందించారు. ప్రస్తుతం హెచ్‌పీబీ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, క్రిటికల్ కేర్ బృందాల సంయుక్త సంర క్షణలో కోలుకుంటున్నారు. ఈ చికిత్సలో డా. ఎం. మణిశేఖరన్ మాట్లాడుతూ.. ‘సంపూర్ణమైన సురక్షితమైన క్యాన్సర్ క్లియరెన్స్ను సాధించడంలో బృందం కృషి పట్ల నేను గర్వపడుతున్నాను’ అన్నారు.
మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ చైర్మన్ డా. భద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయం, అనుభవజ్ఞులైన మా వైద్య నిపుణులు, అధునాతన మౌ లిక సదుపాయాలు, బలమైన బహుళ-విభాగాల విధానం ద్వారా సాధ్యమైందన్నారు. వైస్ చైర్పర్సన్ డా. ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కేసులు లక్షణాలకు మించి వినడానికి, స్పష్టంగా కనిపించే దానికంటే మించి రోగ నిర్ధారణ చేయడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయని చెప్పారు.