22-07-2025 12:00:00 AM
అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
నల్లగొండ టౌన్, జూలై 21 : గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏఐసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జ్ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, గ్రామాలలో మీరే ఒక ముఖ్యమంత్రిగా, మంత్రిగా నాయకునిగా పార్టీ పటిష్టం కొరకు పని చేసి,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాలు గెలిపించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు జీవన్మరణ సమస్య ఈ సమస్యఅని,స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆరు గ్యారెంటీలు కొనసాగు తాయని ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాటిని పూర్తి చేస్తాం.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉందని నిర్ణయించుకొని ఆరు గ్యారెంటీలను మేనిఫెస్టోలో పెట్టాం, కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేతికి చిప్ప వచ్చిందనీ,మెల్ల మెల్లగా ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఆరు గ్యారెంటీ లను కచ్చితంగా అమలు చేస్తాం అన్నారు. భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఆలోచన విధానంతో ఒకే అభిప్రాయంతో ఉంటుందని చెప్పారు.గత పది సంవత్సరాల టిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలు మానసికంగా కృంగిపోయారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ,తిప్పర్తి,కనగల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య,పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, ఆర్టిఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, నల్గొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి శ్రీనివాస్, అరుణాకర్ రెడ్డి,వంగాల అనిల్ రెడ్డి దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి,మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పాదం అనిల్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.