22-07-2025 12:00:00 AM
వనపర్తి టౌన్ జులై 21: జిల్లా అభివృధి చేయడానికి నిరంతరం పనిచేస్తున్న ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నా రెడ్డి, ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే మేఘా రెడ్డి లు అనునిత్యం కృషిచేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. రాజేంద్ర ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకులు గడిచిన 10 ఏండ్ల కాలంలో ప్రజల గురించి పట్టించుకోకుండా నేడు అభివృధి పై మాట్లాడటం కొం డను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్నారు. రాజోలి బండ వద్ద కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని చెప్పారు కానీ ఏమి చేయలేదు పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ ను 10 ఏండ్ల అధికారంలో ఉండి పూర్తి చేయలేదన్నారు.
కృష్ణ నదిలో ఒక్క ఏడాదిలో 600 టి ఎం సి లు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చింది నిజం కదా ఒక్క ఏడాదిలో 600 టి ఎం సి లు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చింది నిజం కదా ,ఉమ్మడి జిల్లా నుండి ఇద్దరు మంత్రులు గా ఉన్న శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి లు పాలమూర్ జిల్లాను పడావు పెట్టారన్నారు . సి.ఎం.అన్నట్లుగా ఏం చేసారు,ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు జీ.ఓ .98 బాధితులకు ఎందుకు న్యాయం చేయలేదు ఏం అభివృద్ధి చేసారో చెప్పాలన్నారు.
ఈ నెల 25 న బీసీ ఐక్యత చాటుతూ ఛలో ఢిల్లీ కార్యక్రమం డిల్లీ లోని కల్ కటెరా స్టేడియం లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి ప్రధాన నాయకులు ‘బాగి దారి‘ న్యాయ సమ్మేళన కార్యక్రమానికి హాజరు అవుతున్నారు కావున జిల్లా లో బీసీ ఎమ్మె ల్యే లు, ఎంపీ లు, సర్పంచు లు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయనపిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నాయకులు ఎండి బాబ, చీర్ల జనార్దన్, అంజి రెడ్డి, కోళ్ల వెంకటేష్, చంద్రశేఖర్ యాదవ్, కదిరే రాములు, సమద్, మన్యం తదితరులు పాల్గొన్నారు.