16-11-2025 05:17:38 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో కార్మికవర్గ ప్రయోజనాల కోసం చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలలో కార్మిక సంఘాల ప్రాముఖ్యతను చాటిచెప్పేలా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) మహాసభలు నిర్వహించడం జరుగుతుందని సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు తెలిపారు. రామకృష్ణాపూర్ లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఏరియాలో యూనియన్ ఎదుగుదల కోసం, చేపట్టిన పోరాటాలతో, పెద్ద ఎత్తున యువ కార్మికులు యూనియన్ లో చేరుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మహా సభలు పట్టణంలో నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు.
మహాసభలతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం పెరుగు తుందన్నారు. సంస్థలో యూనియన్లు బలహీనంగా ఉంటే కార్మిక సమస్యలు పరిష్కారంకు నోచుకోవని కార్మికులపై మరింత పని భారం పెరుగుతుందని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యపోరాటాలు చేపట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్మిక సంఘాలను అణగదొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకు వస్తుందని, వాటిని ఎదుర్కొని ప్రభుత్వ రంగ పరిశ్రమలలో కార్మిక వర్గాన్ని కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలే శరణ్యమని వారు స్పష్టం చేశారు.
ఐక్య పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉండే సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర మహాసభ లను విజయ వంతం చేసేందుకు ప్రతి కార్మికుడు కృషి చేయా లని కోరారు. ఈ మహాసభల లో సింగరేణి కార్మికులు ఎదు ర్కొంటున్న ప్రధానస మస్యలు, సంస్థకు రావాల్సినబకాయిలు, సంస్థ భవిష్యత్తు గురించి పలు తీర్మానాలు ఆమోదించడం జరుగుతుందన్నారు. యువ కార్మికులు పెద్ద ఎత్తున యూని యన్ లో చేరుతున్నందున వారికి ప్రాధాన్యత నిచ్చేలా బ్రాంచ్ కమిటీ నిర్మాణం జరుగుతుందని వారు తెలిపారు. యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సీనియర్ నాయకులు వడ్లకొండ ఐలయ్య, అన్ని గనుల పిట్ సెక్రటరీలు, బ్రాంచ్ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.