calender_icon.png 8 August, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటలను రాజకీయంగా ఎదుర్కోలేకనే కుట్రలు

07-08-2025 12:09:32 AM

ఘట్ కేసర్, ఆగస్టు 6 : మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని బిజెపి నాయకులు, మహబూబాబాద్ మా జీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు.

ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్ లోని మేడ్చల్ నియోజకవర్గo బిజెపి ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో 420 హామీలు, 6గ్యారంటీలలో ఇచ్చిన వాటిలో ప్రధానమైనది కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన అవినీతిని వెలికి తీయడం వారిని శిక్షించడం కానీ వాటిని పక్కన పడే శాడని విమర్శించారు.

రేవంత్ రెడ్డికి రాజకీయ పదవీ కాంక్ష తప్ప పరిపాలనతో ప్రజల జీవితాలను బాగు పరచాలనే బుద్ధి ఏమాత్రం మాత్రం లేదన్నారు.రేవంత్ రెడ్డి తప్పులను ప్రశ్నిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బీజేపీని, ఈటల రాజేందర్ ని ప్రజల్లో చెడ్డ పేరు తీసుకువచ్చే కుట్ర మాత్రమే అన్నారు.నాటి కేసీఆర్ హయాంలో ఆర్ధిక మంత్రి గా ఈటెల నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారాఅటువంటి ఆర్ధిక అవకతవకలకు మాత్రమే ఈటల రాజేందర్ బాధ్యులన్నారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం భారాసా అవినీతిని నిరూపించలేక ఆనేపాన్ని బీజేపీలో ఉన్న ఈటల పై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సొంత కొడుకు కేటీఆర్ అయితే దత్త పుత్రుడు రేవంత్ రెడ్డి అన్నారు.దత్త పుత్రుడు రేవంత్ ఉన్నన్ని రోజులు కేసీఆర్ కు టుంబం జీవితాంతం సేఫ్ గా ఉంటుందన్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో వేసిన పదుల పిల్స్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్) లో ఒక్కదానిపైన అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను నిరూపించాడా అని ప్రశ్నించారు.కాళేశ్వరం విచారణ కమిటీ ఇచ్చిన పూర్తి నివేదిక ప్రజా బహుళ్యంలో పెట్టాలి తప్పించి పది పేజీలు తెచ్చి ప్రజలను మోసం చేసే ప్రయ త్నం మానుకోవాలన్నారు.

ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కాలేరు రామోజీ, మాజీ ఎంపిటిసి ఏనుగు లక్ష్మారెడ్డి, ఘట్ కేసర్ మున్సిపల్ బిజెపి అద్యక్షులు కొమ్మిడి మహిపా ల్ రెడ్డి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు సురేష్ నాయక్, జిల్లా నాయకులు కృష్ణ గౌడ్, మల్లిఖార్జున్, జైపాల్ రెడ్డి, మండల కార్యదర్శి రమేష్ నాయుడు, ఓబిసి మోర్చ అధ్యక్షులు సత్య నారాయణ, స్థానిక బిజెపి నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.