calender_icon.png 21 December, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుష్ప్రచారాలు మానుకోవాలి

21-12-2025 05:13:51 PM

అనంతల నర్సింహాగౌడ్, అయిత గోని యాదయ్య గౌడ్ 

మర్రిగూడ,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి కుట్రలు పన్నిన వారే ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నీచమైన రాజకీయాలకు తెరతీశారని నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలం ఇందుర్తి, మేటి చందాపురం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఏరుకొండ. అబ్బయ్య ఓటమికి కారణమయ్యారని ఇందూర్తి గౌడ్స్ మండిపడ్డారు. శనివారం పార్టీ కి మోసం చేసిన వారు తన మద్దతుదారులతో కలిసి మర్రిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెరుకు లింగం గౌడ్, ఐతగోని అశోక్ గౌడ్‌లు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

తాను గౌడ కులస్తులను అవమానించానని, తీవ్ర పదజాలంతో దూషించానని లింగం గౌడ్, అశోక్ గౌడ్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అబ్బయ్య స్పష్టం చేశారు. గతంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని,ఇది ముమ్మాటికీ తన వ్యక్తిత్వo కించపరిచే విదంగా చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌడ కులస్తులతో తనకు అన్నదమ్ముల వంటి అనుబంధం ఉందని, కుల పెద్దలంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.

సర్పంచ్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్థి అయిన తనకు వెన్నుపోటు పొడిచారని అబ్బయ్య ఆరోపించారు. వారి ద్రోహం వల్లే తాను కేవలం 6 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని గుర్తు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను బీఆర్ఎస్ అధిష్ఠానం లింగం గౌడ్, అశోక్ గౌడ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేసిందని ,అది జీర్ణించుకోలేకనే ఇప్పుడు తనపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ తెలియక గతంలో ఏదైనా సందర్భంలో పొరపాటుగా మాట్లాడి ఉంటే గౌడ కుల బాంధవులను క్షమించమని కోరుతున్నానని చెప్పారు.

రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని అబ్బయ్య అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అనంతల నరసింహ గౌడ్, అయితగోని యాదయ్యగౌడ్, అయిత గోని నరసింహ గౌడ్,అనంతల వెంకటేష్ గౌడ్, అయితగోని యాదగిరి గౌడ్,అయితగొని రాఘవేంద్ర గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.