తెలంగాణ నీళ్లు దోచుకునే కుట్ర
08-06-2024 01:25 AM
బీఆర్‌ఎస్ నేత సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): సీఎం పదవిలో ఉండి రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రాలకు అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే ఇరిగే షన్ సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించారని పేర్కొ న్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కృష్ణబోర్డుకు ఫిర్యాదులు చేసిన వ్యక్తిని రాష్ట్ర జలవనరుల సలహాదారుడిగా నియమించడం దుర్మార్గమ న్నారు. గురుశిష్యులు కలిసి తెలంగాణ నీళ్లను మింగేసే కుట్ర చేస్తు న్నారన్నారు. రేవంత్‌కు రాష్ట్రంపై ప్రేమలేదనేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.






