ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణ 11కు వాయిదా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండి రెండు నెలలు పూర్తయిందని, తమకు బెయిల్ ఇవ్వాలని ఈ కేసులో నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టుకు విన్నవించా రు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్
ఫోన్‌ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీదేవి మరణాంతర కార్యక్రమాల కోసం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై విచారించిన కోర్టు జూన్ 10 నుంచి 14 వరకు రాధాకిషన్‌రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాధాకిషన్‌రావు చంచల్‌గూడ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత ఆదివారం ఆయన తల్లి మరణించగా, ఎస్కార్ట్ బెయిల్‌పై వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.






