డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న స్వామి
బెట్టింగ్ యాప్‌లకు బానిసై, అప్పుల బాధతోనే చనిపోతున్నానని సూసైడ్ నోట్
సికింద్రాబాద్, జూలై 23 (విజయక్రాంతి): డీజీపీ కార్యాలయం లో గురువారం తెల్లవారుజాము న కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. జూలై 2 నుంచి డీజీపీ ఆఫీసు లో రాత్రి విధుల్లో ఉన్న స్వామి.. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో ఆఫీసులోని వాష్‌రూంకు వెళ్లి సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
స్వామి స్వగ్రామం భువనగిరి జిల్లా చౌటుప్పల్. ‘బెట్టింగ్ యాప్‌లకు బానిసై, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటు న్నాను. నా భార్య, పిల్లల్ని ఏమీ అనొద్దు. వాళ్లు మంచి వాళ్లు. చనిపోయిన తర్వాత దెయ్యం అయినా సరే.. వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా’ అని స్వామి తన డైరీలో రాసుకున్న నోట్‌ను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






