calender_icon.png 16 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు లాంఛనాలతో కానిస్టేబుల్ కమలాకర్ అంత్యక్రియలు

16-11-2025 07:51:32 PM

కోదాడ: డ్యూటీలో ఉండగా కారు ఢీకొని మృతిచెందిన కానిస్టేబుల్ కమలాకర్ అంత్యక్రియలు ఆదివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కానిస్టేబుల్ కమలాకర్ మృతి విషయం తెలిసిన వెంటనే స్వగ్రామం గుడిబండలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, నాగారం సీఐ నాగేశ్వరావు, కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, మేళ్ళచెర్వు ఎస్సై పరమేష్, అనంతగిరి ఎస్సై నవీన్, పోలీసులు, అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.