16-11-2025 07:53:38 PM
సమాజానికి మార్గదర్శకులు పాత్రికేయులు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం
పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి
కామారెడ్డి (విజయక్రాంతి): పాత్రికేయుల సేవలు వేల కట్టలేనివని పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి అన్నారు. ఆదివారం సాయంత్రం రోటరీ ఆడిటోరియంలో కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. జాతీయ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పట్టణ ఎస్ హెచ్ ఓ మాట్లాడారు. సమాజానికి మార్గదర్శకులు పాత్రికే యు లని అన్నారు.రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికిని రంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేని వారిని సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్న పాత్రికేయులు నేటి సమాజంలో కీలకపాత్రను పోషిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రంగ వెంకటేశ్వర్లు గౌడ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ హరి, కోశాధికారి పర్ష వెంకటరమణ, వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ప్రోగ్రాం ప్రోగ్రాం చైర్మన్ పోల బోయిన సత్యం, రొటీరియన్స్ రాజ నరసింహం, నాగభూషణం, నవీన్, విజయ్, పాత్రికేయులు ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, దశ గౌడ్, రాజు, విజయానంద్, రజినీకాంత్, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.