calender_icon.png 16 November, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి త్రిలింగేశ్వర దేవాలయంలో సత్యనారాయణ వ్రతం

16-11-2025 07:49:55 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాస విశిష్టమైన రోజైనటువంటి మాస శివరాత్రి సందర్భంగా తేదీ 18.11.2025 మంగళవారం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల మహిమాన్విత శివలింగం కలిగిన తాండూర్ త్రిలింగ రామేశ్వర దేవాలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించ వలెనని వేద పండితులచే నిశ్చయించనైనదనీ ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు తెలిపారు.

మొట్టమొదటి సారిగా ఆలయం వద్ద జరిపే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా,సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.సత్యనారాయణ వ్రతములో కూర్చునే దంపతులు ముందుగా పేరు నమోదు చేసుకోవలెను.పేరు నమోదు చేసుకున్న దంపతులు సంప్రదాయ వస్తువుల ధరించి మాత్రమే ఉదయం 9 గంటల వరకు, అభిషేకం చేయగలరని దంపతులు ఉదయం 8 గంటల వరకు ఆలయం వద్దకు చేరుకోవాల్సిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు పేర్కొన్నారు.