15 March, 2026 | 2:32 PM

కానిస్టేబుల్ వీరంగం

14-10-2024 01:25 AM

సూర్యాపేట, అక్టోబర్ 13 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని చిలుకూర్ మండలం బేతవోలు గ్రామంలో దసరా ఉత్సవాల్లో గొడవకు దిగిన ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. శనివారం పండుగ సందర్భంగా బేతవోలు గ్రామానికి వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ కనకదుర్గ ఆలయానికి వచ్చిన మాజీ సర్పంచ్ నాగయ్యను కాలితో తన్ని దాడికి పాల్పడ్డాడు.

దీంతో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడిని ఆపేందుకు వచ్చిన ఏఎస్సై వెంకటేశ్వర్లు, కోదాడ సీఐ రాముతో కూడా ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వరకుమార్‌పై చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి తెలిపారు.