05-09-2025 01:41:22 AM
కాంగ్రెస్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం నుండి పె ద్దరాతుపల్లి చెంచులవాడ మీదుగా రూ. 10 కోట్ల రూపాయల తో ఎలిగేడు మండలం నర్సాపూర్ శివాలయం నుండి రాములపల్లి వరకు రూ. 1.27 కోట్ల రూపాయలతో నూతన బి.టి రో డ్ల నిర్మాణాలకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులు మం జూరు చేయడం జరిగిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సర్కారుతోనే అభివృధి, సంక్షేమం నడుస్తుందని, అలాగే పెద్దపల్లి నియోజకవర్గానికి రూ. 11.27 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు ఎమ్మెల్యే విజయరమణ రావు కృతజ్ఞతలు తెలిపా రు.నూతన బి.టి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేపించినందుకు ఎమ్మెల్యే విజయరమణ రావు కు మండలాల ప్రజలు ధన్యవాదాలుతెలిపారు.