05-09-2025 01:39:30 AM
సుల్తానాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో గురువారం పెద్ద చెరువు వద్ద స్థానిక నాయకులు అధికారులతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్య మాట్లాడుతూ...
మున్సిపల్ పరిధితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విఘ్నేశ్వరుడి మంటపాలా నిర్వాహకులు శాంతియుతంగా తమ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించి ఎలాంటి గొడవలకు తావు లేకుండా మద్యానికి దూరంగా ఉండి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ తీగలను గమనిస్తూ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్రమ పద్ధతిన చక్కటి వాతావరణంలో భజనలతో ర్యాలీలు నిర్వహించాలని , అలాగే గొడవలకు ఎవరు తావు ఇవ్వవద్దన్నారు.
నిర్దేశించిన సమయంలో విగ్రహాలను మండపాల నుంచి తరలించి గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమీప చెరువుకు తరలి వెళ్లి త్వరితగతిన నిమజ్జనం చేపట్టాలని సూచించారు. చెరువు కట్ట వద్ద అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ తో పాటు వైద్యము మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంటాయని అలాగే చెరువు సమీపాన గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్ ను ఏర్పాటు చేశామని,
కట్టపై భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, చెరువులో సైతం గజ ఈత గాళ్ళు అందుబాటులో ఉంటారని, చిన్నపిల్లలు వృద్ధులు నిమజ్జనం చేసే సమయంలో విగ్రహాలతో ఉండకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పడాలని సూచించారు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని, అలాగే మున్సిపల్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని ప్రశాంతంగా వేడుకలు ముగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తో పాటు పలువురుపాల్గొన్నారు.