calender_icon.png 6 September, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చల్మెడలో అరుదైన నరాల శస్త్రచికిత్స

05-09-2025 01:42:55 AM

కరీంనగర్, సెప్టెంబరు 4 (విజయ క్రాంతి): కరీంనగర్ శివారు బొమ్మకల్లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో ఆరుదైన నరాల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సల్లో పలువురు రోగులు కొలుకోని ఆరోగ్యంగా తిరుగున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఈ సందర్బంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరాల వ్యాదుల విభాగం అధిపతి డాక్టర్ సంజయ్, కె వెంకటేష్, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలతో, అన్ని రకాల వైద్య చికిత్సలు చేస్తున్నామని తెలిపారు.

ఆసుపత్రిలో నరాల సంబందించిన వైద్య విభాగంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, డిఎస్‌ఎ (డిజిటల్ సబ్ స్రాక్షన్ ఆజియేగ్రఫి)లు, ఐవి తాంబ్రో లైసిస్ ( రక్తాన్ని కరిగించే ప్రక్రియ), తాబెక్టమీ వైద్యపరీక్షలు చేస్తూ రోగులకు అందజేస్తున్నామని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో మొట్టమొదటి సారిగా రోగులకుఈ ప్రక్రియ ద్వారా స్టంట్లో వేయడం జరిగిందని తెలిపారు.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఓదెల గ్రామానికి చెందిన విపట్టల శ్రీదర్ (43), రామగుండుకు చెం దిన గుంటు దేవేందర్ (48), మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన నక్క సత్యనారాయణ (65) డిఎస్‌ఎఇ చికిత్స అందించడం ద్వారా వారు కోలుకున్నారని తెలిపారు.

ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ డివి రామకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ ఆసిమ్ ఆలీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డాక్టర్ శ్రావణ్, న్యూరాజీ విభాగాల వైద్యులు డాక్టర్ పి హరిత, డాక్టర్ దివ్వ, డాక్టర్ రవళి, డాక్టర్ శి. డాక్టర్ ప్రఫుల్ డాక్టర్ మయూర్, తదితరులుపాల్గొన్నారు.