27-01-2026 12:00:00 AM
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు
మంథని, జనవరి26(విజయ క్రాంతి) గ్రామ పంచాయతీల హక్కులు కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు.సోమవారం హన్మకొండ జి ల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం ఎంఎన్ ఆర్ ఈజీఏ పేరు మార్పుకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమములో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసే జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేయడం సరికాదన్నారు.కొత్త చట్టం వల్ల పేదలకు జరుగుతున్న నష్టంపై వివరించా రు.ఉపాధి హామీ పథకాన్ని యధాతథంగా కొనసాగించాలని తీర్మానాలు చేశారు.ఆత్మకూర్ గ్రా మ ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభ నిర్వహించి ఎంఎన్ ఆర్ ఈజీఏ చట్టాన్ని యదాతదంగా కొనసాగించాలని కోరుతూ తీర్మానాలు చేసి అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉపాధి హామీ కూలీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.