28-01-2026 12:00:00 AM
నేటి నుంచి నామినేషన్ ల స్వీకరణ
మెదక్, జనవరి 27 (విజయ క్రాంతి) :ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా , పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ విడుదల:
28.-01-.2026 నామినేషన్ల స్వీకరణ: 28.-01-.2026 నామినేషన్ల దాఖలుకు చివరి తేది:30-.01-.2026 నామినేషన్ల పరిశీలన: 31.-01-.2026 నామినేషన్లపై అభ్యంతరాలు:01-.02-.2026 అభ్యంతరాలపై పరిష్కారం:02.-02-.2026 నామినేషన్ల ఉపసంహరణ గడువు:03.02-.2026 బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల:03.-02.-2026 పోలింగ్:11-.02-.2026 రీపోలింగ్-12.-02-.2026 కౌంటింగ్:13.-02-.2026 ఉదయం 8 గంటల నుండి ఉంటాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.