17 April, 2026 | 2:41 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

30-05-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్, మే 29 : ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో నిర్మిస్తున్న అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మా ణ పనులను మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణతో కలిసి సందర్శించి పనులు వేగవం తం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిష న్ భగీరథ పథకం, అమృత్ 2.0 పథకాల ద్వారా ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో పట్టణంలో చేపట్టిన అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో గా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి త్వర త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని ఆస్నాద్, గంగారం గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహశిల్దార్ మల్లిఖార్జున్‌తో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.

కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.