25-08-2025 07:55:48 PM
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తండ్రి చంద్రారెడ్డి ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి సోమవారం సూభాష్ రెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బోపన్నపల్లి సుధాకర్ రెడ్డి, కంది ఆగి రెడ్డి, ఆకారపు అరుణ్,తెల్కల మోహన్ రెడ్డి, రమేష్ నాయక్, సల్ల ప్రభాకర్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.