25-08-2025 07:57:14 PM
చండూరు (విజయక్రాంతి): నల్గొండ జిల్లా(Nalgonda District) చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరతి బోనాల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయం స్థల దాత పాల్వాయి సీతారాంరెడ్డిని ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ఈ బోనాల ఉత్సవాలకు సహకరించిన అనంత చంద్రశేఖర్ గౌడ్, నలగంటి మల్లేశం లకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు మా అంగడిపేట గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకుంటూ, వర్షాలు పడి పంటలు పండి రైతులు అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.